
4 Injured in Vijayawada Car Racing: ఏపీలోని విజయవాడ నగరంలోని జాతీయ రహదారిపై శనివారం (నవంబర్ 18) అర్ధరాత్రి కార్ల రేసింగ్ జరిగింది. బెంజ్, ఫార్చ్యూనర్ కార్లతో యువతీ, యువకులు రేస్ నిర్వహించారు. ఐఈపీఎల్ ఐనాక్స్ ఎదురుగా రెండు కార్లు అతివేగంగా దూసుకొచ్చాయి. ఓ ఫార్చూనర్ కారు అదుపుతప్పి రామవరప్పాడు వైపు వెళ్తున్న 2 స్కూటీలను ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. తీవ్ర గాయాలైన వీరిని స్థానికులు వేంటనే ఆస్పత్రికి తరలించారు.
Also Read: AUS Playing 11 vs IND: ఫైనల్ కోసం ఆస్ట్రేలియా కీలక మార్పు.. భారత స్పిన్‌ను ఎదుర్కొనే మొనగాడు వచ్చేస్తున్నాడు!
ఈ ఘటనలో ప్రమాదానికి గురైన స్కూటీలు ముక్కలు ముక్కలు అయ్యాయి. ఫార్చూనర్ కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదానికి కారకులైన ఫార్చూనర్ కారులోని యువతి, యువకుడు.. మరో కారులో పరారయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. గత కొంత కాలంగా బెజవాడలో కార్ల రేసింగ్ తరచుగా జరుగుతోంది.