Leading News Portal in Telugu

Fishing Harbour Fire Accident: ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదా..?



Fishing Harbour

Fishing Harbour Fire Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం మత్స్యకారులకు తీవ్ర విషాదాన్ని మిగిలిచింది.. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో ఉండగా జరిగిన ఘోర అగ్నిప్రమాదం గంగపుత్రులకు కాళరాత్రిగా మారింది.. ఒకటి కాదు రెండు కాదు సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయాయి.. రూ. 40 కోట్ల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు.. ఎవరో ఆకతాయిలు చేసిన పని వందలాదిమంది మత్స్యకార కుటుంబాలకు కడుపు కోతను మిగిల్చింది.. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతి అయిపోవడంతో జీర్నించుకోలేకపోతున్నారు.

Read Also: Vijayakanth: ఆస్పత్రిలో చేరిన విజయకాంత్‌.. ఆందోళనలో ఫ్యాన్స్..

అయితే, అగ్నిప్రమాదం జరగగానికి ఓ మందు పార్టీ, ఆ తర్వాత జరిగిన ఘర్షణే కారణంగా తెలుస్తోంది.. యుట్యూబర్ కి బాలాజీ అనే వ్యక్తి కి నిన్న రాత్రి ఒకటో నెంబర్ జెట్టి లో గొడవ జరిగిందట.. యుట్యూబర్ బోటుని అమ్మకానికి పెట్టడంతో కొనుగోలు చేసిన బాలాజీ అనే వ్యక్తి.. అడ్వాన్స్ గా కొంత సొమ్ము ఇచ్చాడట.. కానీ, కొద్ది రోజులకి అడ్వాన్సు తిరిగి అడిగాడట బాలాజీ.. ఈ విషయంలోనే నిన్న రాత్రి అదే గొడవ జరిగినట్టుగా సమాచారం.. దీంతోనే మద్యం మత్తులో బోటు తగలుబెట్టి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు..

Read Also: CM KCR: మానకొండూర్ సభకు కేసీఆర్‌.. సీఎం బస్సును చెక్ చేసిన అధికారులు

ఇక, ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన విశాఖ జేసీ విశ్వనాథం.. నిన్న కొంతమంది యువకులు మద్యం మత్తులో ఫిషింగ్ హార్బర్‌లో హంగామా సృష్టించారని తెలిపారు.. అర్ధరాత్రి మద్యం తాగి గొడవ పడి బోటుకు నిప్పంటించారు.. కొంతమంది యువకుల మీద అనుమానం ఉందన్నారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. వారే అని తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు.. ఈ ప్రమాదంలో సుమారు 35 నుండి 40 బోట్లు దగ్ధమయ్యాయి.. ఆస్తి నష్టం ఎంత జరిగిందనేది అంచనా వేస్తున్నాం అన్నారు అన్నారు జేసీ విశ్వనాథం..

Read Also: Pat Cummins: ఆడు మగాడ్రా బుజ్జి.. అన్నంత పని చేశాడు!

మరోవైపు, ఫిషింగ్ హార్బర్ ప్రధాన ద్వారం వద్ద మత్స్యకార కుటుంబాలు ఆందోళనకు దిగాయి.. దగ్ధమైన బోటులకు, దానిపై ఆధారపడిన మత్సకారులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఘటన స్థలానికి సీఎం వైఎస్‌ జగన్‌ రావాలని డిమాండ్ చేస్తూ హార్బర్ గేటు వద్ద బైఠాయించారు మత్స్యకార కుటుంబాలు.. కాగా, అగ్ని ప్రమాదం ఘటనలో యూట్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా సమాచారం..