Leading News Portal in Telugu

Sajjala Ramakrishna Reddy: అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ



Sajjala

అంతర్జాతీయ దొంగల ముఠాలకి ఏమాత్రం తీసిపోని పార్టీ టీడీపీ అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్కులతో ఏం చేస్తున్నారో ఈ మధ్యే బయట పడింది అని అన్నారు. పచ్చ దొంగల ముఠా పట్టపగలు ఇళ్ళమీద పడుతోంది అప్రమత్తంగా ఉండాలి.. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ 20 జూన్ 2024 నుంచీ మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఇచ్చారు.. అమలు అనేది అధికారంలోకి వచ్చాక ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. 2014లో అడ్డంగా ఇచ్చిన హామీలు ఇవ్వకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా టీడీపీ అడ్డగోలు హామీలు ఇస్తుంది.. ఇలాంటి చర్యలను ఏ విధంగా శిక్షించాలో మరి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Read Also: Israel-Hamas War: హమాస్‌పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్.. 24 గంటల్లో 250 టార్గెట్‌లపై బాంబుల వర్షం..

చంద్రబాబు 5 కోట్ల మందిని ప్రలోభపెట్టి మోసం చేస్తున్నాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ చట్టం కింద ఇదంతా చేయొచ్చో చంద్రబాబు చెప్పాలి.. 2019లో వైసీపీ ఓట్లు తీయించి మానిప్యులేట్ చేసాడు.. ప్రత్యర్ధి పార్టీ ఓట్లు తప్పించి గెలుపు తెచ్చుకోవాలని 2019లో ప్రయత్నించాడు.. సేవామిత్ర యాప్ ద్వారా కూడా ఓట్ల విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారు అని ఆయన మండిపడ్డారు. పొలిటికల్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓటర్, ఓటరు కులం తెలుసుకుంటున్నారు.. 2017లో 50లక్షల వైసీపీ ఓట్లు తీసేసాడు చంద్రబాబు.. ప్రతి పక్షంలోకి వచ్చాక ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు.. రాష్ట్ర స్ధాయిలో అన్యాయమైన విధానాలు ఫాలో అవుతున్నారు.. చంద్రబాబు చేస్తున్న పనులపై సెంట్రల్ ఎలక్షన్ కమీషన్ కు కంప్లైంట్ చేస్తామన్నారు. బందిపోటు దొంగ, మోసగాడు చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.