Pawan Kalyan: మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏది..?

Pawan Kalyan: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కడలినీ, కాయ కష్టాన్నీ నమ్ముకొని ఆటుపోట్లతో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపారు.. మత్స్యకారుల సంక్షేమం.. ఉపాధి కల్పనపై ప్రభుత్వానికి చిత్తశుద్ధిఏదీ ఏది? అని నిలదీశారు. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమం ఆ దిశగా అడుగులు వేస్తాం. మెరైన్ ఫిషింగ్ కి తగ్గట్లు సుదీర్ఘ తీరం ఉన్న మన రాష్ట్రంలో, ఇన్ ల్యాండ్ ఫిషింగ్ కి అనువుగా ఎన్నో జల వనరులు ఉన్నాయి. కానీ, మన మత్స్యకారులకు తగిన జీవనోపాధి లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారు. మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై రాష్ట్ర పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు.
Read Also: Govt Job: ప్రభుత్వ ఉద్యోగం కోసం.. తండ్రినే హతమార్చాలనుకున్న కుమారుడు! సినిమా మాదిరి స్కెచ్
గుజరాత్, కేరళ తీరాల్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఒక జెట్టీ ఉండటంతో మత్స్యకారుల ఉపాధికి, వేటకి సౌలభ్యం ఏర్పడింది అన్నారు పవన్ కల్యాణ్. అయితే, మన రాష్ట్రంలో మాత్రం జెట్టీలు నిర్మిస్తాం.. హార్బర్లు కట్టేస్తాం అని మాటలు మాత్రమే ఈ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి అధికార నివాసానికి రూ.451 కోట్లు వెచ్చించేందుకు నిధులు విడుదల చేసే ప్రభుత్వం.. మత్స్యకారులకు జెట్టీలు, హార్బర్లు నిర్మాణానికి మాత్రం ఆసక్తి చూపటం లేదని దుయ్యబట్టారు. రుషికొండపై నిర్మితమవుతున్న రాజ మహల్ కోసం చేస్తున్న ఖర్చుతో ఒక హార్బర్ నిర్మించవచ్చు. ఏడు జెట్టీలు నిర్మాణం చేయవచ్చు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల ఉపాధి, సంక్షేమం అనేవి ప్రాధాన్యం కాదు.. రుషికొండ కొట్టేసి మహల్ నిర్మించుకోవడమే ముఖ్యం అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Telangana Elections 2023: ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.. రాజస్థాన్ కంటే ఎక్కువ సొత్తు ఇక్కడే సీజ్
మత్స్యకారులకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో సైతం నిబంధనల పేరుతో కోతలు వేస్తున్నారని నిలదీశారు పవన్ కల్యాణ్.. వలలు, డీజిల్ రాయితీలపైనా జగన్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ఉమ్మడి ప్రభుత్వంలో.. హామీలు, శంకుస్థాపనలతో సరిపుచ్చకుండా మత్స్యకారులకు ఉపాధి కల్పనపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. మన మత్స్యకారులు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లాంటి చోట్లకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం అన్నారు. తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడతామని తన ప్రకటనలో పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.