
Crime news: ప్రాణాలను తీయ్యడం, తీసుకోవడం చాల తేలిక. అయితే ప్రాణాలను పోయడమే కష్టం. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురావడం అసాధ్యం. అయితే ప్రస్తుతం కొంత మంది ప్రాణాల విలువ తెలిసీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మాట ఇప్పడు చెప్పడానికి కారణం.. ఓ జంట ప్రేమించి పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి కాపురం పెట్టారు. అంత సజావుగా సాగుతుంది అనుకునే లోపే ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలను విడిచారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా లోని రామగిరి మండలం లో గంగంపల్లికి చెందిన దాదా, జ్యోత్స్న ఒకరి నొకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అయితే ఇరువురి కులాలు వేరు కావడం చేత పెద్దలు వాళ్ళ పెళ్ళికి అంగీకరించలేదు.
Read also:Counting Centers: నిఘా నీడలో కౌంటింగ్ కేంద్రాలు.. ఏర్పాట్లు చేసిన అధికారులు
దీనితో 3 నెలల క్రితం ఇద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి గంగంపల్లిలో కాపురం కూడ పెట్టారు. అంత సజావుగా సాగుతుంది అనుకునే లోపే వాళ్ళ శ్వాస ఆగింది. కలిసి బ్రతకాలని పెద్దలను ఎద్దిరించి ఒక్కటైయ్యారు ఈ జంట.. అయితే ఏం అయినదో తెలీదు గాని వివాహం జరిగిన మూడు నెలలకే ఈ దంపతులు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చావు లోనూ ఒకరికి ఒకరు తోడు అన్నట్లు కలిసే ప్రాణాలను తీసుకున్నారు. కాగా ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు అనుకున్న ఈ జంట అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే దంపతులు ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాల గురించి తెలియలేదు.