Leading News Portal in Telugu

Chandrababu: చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ వాయిదా



Chandrababu Bail

Chandrababu:  మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లపై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. సోమవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి ప్రయోజనం కల్పించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

డిస్టలరీస్, బార్లకు లబ్ధి చేకూరిందని ఏజీ వాదనలు వినిపించారు. ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకోలేదని ఏజీ కోర్టుకు తెలిపారు. ప్రివిలేజ్‌ ఫీజు తొలగింపుపై మంత్రిమండలిలో ఎలాంటి చర్చ జరగలేదని ఏజీ పేర్కొన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.