Leading News Portal in Telugu

Minister Buggana Rajendranath Reddy: గజ దొంగే.. దొంగా దొంగా అన్నట్టు టీడీపీ నేతల తీరు.. మండిపడ్డ మంత్రి



Buggana Rajendranath Reddy

Minister Buggana Rajendranath Reddy: గజ దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లుంది.. తెలుగు దేశం పార్టీ నేతలు దోపిడీ గురించి మాట్లాడుతుంటే అంటూ మండిపడ్డారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. మెగా సంస్థకు ప్రభుత్వ గ్యారెంటీ ఆరోపణలు అవాస్తవం అని కొట్టిపారేశారు. రుణానికి సంబంధించిన పూర్తి బాధ్యత మేఘా సంస్థదే.. ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. ఆరోగ్యశ్రీ పై గత ప్రభుత్వం వెచ్చించింది రూ.5,177 కోట్లు, మా ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.9,514 కోట్లు అని.. ఒక ఫ్రెషర్ చంద్రబాబు కళ్లల్లో పడడం కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటారని దుయ్యబట్టారు. మేఘా కంపెనీ ప్రభుత్వ గ్యారెంటీతో 2000 కోట్లు అప్పు తెచ్చుకుందని ఆరోపించారు.. గ్యారంటీ లెటర్ అంటే ఏంటో తెలుసా? అసలు అంటూ నిలదీశారు.

Read Also: Jai Ram Thakur: హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అబద్ధపు గ్యారెంటీలు.. సాక్ష్యాలు ఇదిగో..!

ఫ్రెషర్స్ ని ఆర్థిక పరమైన అంశాల గురించి ముందు తెలుసుకోవాలి.. బ్యాంక్ లు మెగా సంస్థ విశ్వసనీయత ఆధారంగానే లోన్ లు ఇస్తున్నాయని తెలిపారు మంత్రి బుగ్గన.. మెగా సంస్థకు ఎన్ని బకాయిలు ఉన్నాయి అని వివరాలు మాత్రమే బ్యాంకులకు ఇచ్చామన్న ఆయన.. నిర్మాణంలో ఉన్న పెద్ద నీటి పారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం 2019లో దిగిపోయే నాటికి రూ.40 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.. ఈ బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 2019లో టీడీపీ ప్రభుత్వం రూ.40,000 కోట్లు పెండింగ్ బిల్లులకు కూడా గ్యారంటీ అడిగారా? అంటూ ప్రశ్నించారు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.