Vizag Fishing Harbour Fire Incident: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో ఘటనలో మరో ట్విస్ట్.. ఆ ఇద్దరు ఎవరు..?

Vizag Fishing Harbour Fire Incident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో ఘటనలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు వెలుగు చూస్తున్నాయి.. మొదట యూ ట్యూబర్ లోకల్ బాయ్ నానిపై ఆరోపణలు వచ్చినా.. ఆ తర్వాత అతని పాత్ర లేదనే నిర్ధారణకు వచ్చారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు మెట్లు ఎక్కాడు నాని.. ఆ పిటిషన్‌పై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది..
మరోవైపు.. ఫిషంగ్ హర్బర్ అగ్నిప్రమాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం కేసులో కీలక ఆధారాలు సేకరించారు విశాఖ పోలీసులు.. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేశారు.. 10:48 నిమిషాలకి హడావుడిగా బోటు నుండి ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినట్టు ఆ సీసీ టీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా.. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే అంటే రాత్రి 10:50కి అగ్ని ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అగ్నిప్రమాదం ప్రారంభ దశలో వెలుగులోకి వచ్చింది మరో వీడియో.. అయితే, అగ్ని ప్రమాదానికి ముందే హార్బర్ లో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. ఎన్ టీవీకి చిక్కిన ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదం సీసీ టీవీ ఫుటేజ్‌ను చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..