Leading News Portal in Telugu

Pawan Kalyan: విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యింది..


Pawan Kalyan: విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యింది..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో విశాఖ జిల్లా టీడీపీ ముఖ్య నాయకత్వం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. అరగంటకు పైగా సమావేశం జరిగింది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ , ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు.

2019లో మిస్ కమ్యూనికేషన్ కారణంగా వేరు వేరుగా పోటీ చేశామని పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. విడివిడిగా వెళ్లడం వల్లే వైసీపీకి ప్లస్ అయ్యిందని.. అటువంటి తప్పు మళ్లీ జరక్కూడదనే సమయం వున్నా పొత్తులు ప్రకటించానని పవన్‌ స్పష్టం చేశారు. పదవులు ఎవరికి వస్తాయనేది ఇప్పుడు ప్రధానం కాదని.. కేసులకు భయపడాలిసిన అవసరం లేదు.. మీ వెంట నేను ఉంటా అంటూ జనసేన అధినేత పవన్‌ పేర్కొన్నారు. ఓట్ల వ్యవహారం సహా ప్రభుత్వ వైఫల్యాలపై తాను చేసే ప్రతీ విమర్శకు బలమైన ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.