Leading News Portal in Telugu

V Srinivasa Rao: అన్నయ్య కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్‌ ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా..?


V Srinivasa Rao: అన్నయ్య కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్‌ ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా..?

V Srinivasa Rao: అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. పవన్ కల్యాణ్‌.. జనసేన పార్టీని ఆర్ఎస్ఎస్‌కు అమ్ముతావా? అంటూ ప్రశ్నించారు సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకొని తిరుపతికి వస్తున్నారు.. తిరుమల సాక్షిగా ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.. ఇదే సమయంలో.. పవన్ కల్యాణ్‌ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటున్నారు.. అంటే బుల్డోజర్ పాలన కావాలా.? అని నిలదీశారు.. ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్‌.. బీజేపీని ఏ నాడైనా ప్రశ్నించారా..? బీజేపీ ఇస్తున్నవి పాచిపోయిన లడ్డూలు అని విమర్శించి.. ఇప్పుడు ఎందుకు బీజేపీకి వంత పాడుతున్నారు.. పవన్ పాచిపోయిన లడ్డూలు తెచ్చి తిరుపతి వెంకన్న ముందు పెట్టి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక హోదా అంశంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు శ్రీనివాసరావు.. ప్రత్యేక హోదాపై ప్రజలే నిరసనలు నిర్వహిస్తారన్నారు. ఇక, అన్నయ్య కాంగ్రెస్ కు అమ్మేస్తే.. పవన్ ఆర్ఎస్ఎస్ కు అమ్ముతావా? అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ పార్టీని ఆర్ఎస్ఎస్ లో విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. జన సైనికులను పవన్ కల్యాణ్‌ మోసం చేస్తున్నారు.. జన సైనికులారా పవన్‌ కల్యాణ్‌ని ప్రశ్నించండి అంటూ పిలుపునిచ్చారు సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.