
Kollu Ravindra: మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్టు పేర్ని నాని తీరు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లపై హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. ఆ పిల్ ప్రకారం ఆర్డీఓ, డీటీకి షోకాజ్ నోటీసులు ఇస్తే కాళ్లు పట్టుకుని అపుకున్నాడని ఆయన విమర్శించారు. పేర్ని అధికార దాహనికి అధికారులు బలైపోతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. పేర్ని నాని చేసిన తప్పులను అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు లేకపోవటంతోనే కోర్టుకు వెళ్లామన్నారు. అధికారులకు ఒక్కటే చెపుతున్నాం రాజ్యాంగ పరిధులు దాటి ప్రవర్తిస్తే మీరు ఇబ్బందులు పడతారన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో 30 బోట్లు పూర్తిగా, 19 పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పారు. మత్య్యకారులు రోడ్డెక్కితే కానీ పరిహారం ప్రకటించలేదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ ఘటన పూర్తి భాద్యతే ప్రభుత్వానిదే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులిచ్చారని.. టీడీపీ లక్షా 50వేలు, స్వచ్ఛందంగా ఇస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఇస్తున్నాడు.. సొంత సొమ్ము ఏమి ఇవ్వలేదు గుర్తుపెట్టుకో అంటూ వ్యాఖ్యానించారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ మీద గాని తెలుగుదేశం మీద గాని పిచ్చివాగుడు వాగితే నీకు తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు.