Leading News Portal in Telugu

Saneeswara Temple: శనీశ్వర స్వామి గుడిలో అపచారం.. నూనెకు బదులు పెట్రోల్ పోసిన భక్తుడు


Saneeswara Temple: శనీశ్వర స్వామి గుడిలో అపచారం.. నూనెకు బదులు పెట్రోల్ పోసిన భక్తుడు

Mandapalli Saneeswaralayam: మందపల్లి శనీశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లలోని కొత్తమండంలో మందపల్లిలోని ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. శనిగ్రహణికి ఆదర్శమైన స్థలంగా, శనిదేవుడి పూజా క్షేత్రంగా నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అపచారానికి ఒడిగట్టాడు. లింగంపై నూనె బదులు ప్రెట్రోల్ పోశాడు. దీనిని గుర్తించిన ఆలయ అర్చకులు అతడిని పట్టుకుని నిలదీశారు. దీంతో బయట అమ్మితే కొన్నట్టు తెలిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. లింగంపై నూనెకు బుదుల పెట్రోల్ పోయడంతో ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి సంప్రోక్షణ చేశారు.