Leading News Portal in Telugu

Kommareddy Chalama Reddy: టీడీపీకి మరో షాక్‌.. వైసీపీ గూటికి సీనియర్‌ నేత..!


Kommareddy Chalama Reddy: టీడీపీకి మరో షాక్‌.. వైసీపీ గూటికి సీనియర్‌ నేత..!

Kommareddy Chalama Reddy: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్‌ నేత ‘ఫ్యాన్‌’ కిందకు చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పుడు పల్నాడు జిల్లాలో సీనియర్‌ నేతగా ఉన్న కొమ్మారెడ్డి చలమారెడ్డి వైసీపీలో చేరనున్నారు.. మాచర్ల నియోజక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత కొమ్మారెడ్డి చలమారెడ్డి.. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉన్నారు.. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. అయితే, స్వల్ప ఓట్లతో తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు.. అప్పటి నుంచి టీడీపీలోనే ఉన్న ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టుగా చెబుతున్నారు.. అయితే, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరేందుకు.. తాడేపల్లికి బయల్దేరి వెళ్లారట కొమ్మారెడ్డి చలమారెడ్డి.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని విజయంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పలువురు కీలక నేతలు టీడీపీకి గుడ్‌బై చెప్పిన విషయం విదితమే.. ఇక, ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. మరోసారి ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకుంటూ వస్తుంది వైసీపీ.. ఈ మధ్య కొందరు జనసేన నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. టీడీపీ, జనసేనకు చెందిన మరికొందరు నేతలు కూడా.. వైసీపీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది.