
Chelluboina venugopala krishna: ఆంధ్రప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వచ్చాయి.. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నుంచి తిరుపతి వెళ్తుండగా మంగళగిరి సమీపంలో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో, వెంటనే ఆయనను విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించడం.. ఆ తర్వాత ఆయనను మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఇదే సమయంలో.. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు గుండెనొప్పి అనే వార్తలు హల్‌చల్ చేశాయి.. అవి అవాస్తవమని ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. కొన్ని మీడియాలు చూపిస్తున్నట్లు గుండె జబ్బు కాదని.. కేవలం అస్వస్థతకు గురయ్యారని క్లారిటీ ఇచ్చారు.
అయితే, మంత్రి వేణుగోపాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ఓ ప్రకటన చేసింది.. మంత్రి వేణు ఆరోగ్యం బాగానే ఉంది.. గత కొన్ని రోజులుగా వరుసగా పార్టీ కార్యక్రమంలో పాల్గొని సరైన నిద్ర లేని కారణంగా గాస్టిక్ ఇబ్బంది వచ్చిందని తెలిపారు.. సాధారణ బాడీ చెక్అప్ నిమిత్తం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. చాలా రోజుల నుండి విశ్రాంతి లేకపోవడంతో మాత్రమే ఈ సమస్య వచ్చిందన్నారు. ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది డాక్టర్లు తెలియజేసినట్టు వెల్లడించారు.. మరేమీ కాదు.. ఎటువంటి వదంతులు నమ్మకండి అంటూ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సోషల్ మీడియా టీమ్ ప్రకటన చేసింది.