Leading News Portal in Telugu

YSRCP Samajika Sadhikara Bus Yatra 24 Day: 24వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు షెడ్యూల్..


YSRCP Samajika Sadhikara Bus Yatra 24 Day: 24వ రోజుకు చేరిన వైసీపీ సామాజిక సాధికార యాత్ర.. ఈ రోజు షెడ్యూల్..

YSRCP Samajika Sadhikara Bus Yatra 24 Day: వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు ఫుల్ రెస్పాన్స్ వస్తోందని ఆ పార్టీ నేతలు, మంత్రులు చెప్పేమాట. ఇప్పటికే 23 రోజుల బస్సుయాత్ర పూర్తైంది. నిన్న విజయనగరం జిల్లా నెల్లిమర్ల.. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర జరిగింది. ఏపీ సీఎం జగన్ చేస్తున్న పథకాలు వివరిస్తున్నారు మంత్రులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు. చంద్రబాబు హయాంలో ఏపీ ఎలా ఉంది.. ప్రస్తుతం జగన్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో మంత్రులు ప్రజలకు వివరిస్తున్నారు. టీడీపీ హయాంలో తమకోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.

ఇక ఇవాళ 24వ రోజు సామాజిక సాధికార యాత్ర కృష్ణా జిల్లా మచిలీపట్నం, పార్వతీపురం జిల్లా కురుపాంలో జరగనుంది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో సాగనుంది సామాజిక సాధికార బస్సు యాత్ర.. గరుగుబిల్లి మండలం నదివానివలస జట్టు ఆశ్రమంలో వద్ద సమావేశం నిర్వహించనున్నారు.. నందివానివలస నుంచి మేరంగి మీదుగా ర్యాలీ నిర్వహిస్తారు.. కురుపాం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. బస్సు యాత్రకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, వైసీపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ఉత్తరాంధ్రలో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.