రేపు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నంద్యాల, కడప జిల్లాల పర్యటించనునున్నారు. నంద్యాల జిల్లాలో అవుకు రెండవ టన్నెల్‌ను జాతికి అంకితం చేయనున్నారు. కడప పెద్దదర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో ఆయన పాల్గొననున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి వెళ్లనున్నారు. అక్కడి నుంచి అవుకు రెండవ టన్నెల్ సైట్‌కు సీఎం జగన్ చేరుకోనున్నారు. నీటిని విడుదల చేసి రెండవ టన్నెల్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలన, పైలాన్ ఆవిష్కరణ చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా కడపకు సీఎం జగన్ వెళ్లనున్నారు.
కడప పెద్ద దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సాయంత్రం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. వరద జలాలను ఒడిసిపట్టి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే విధంగా అవుకు టన్నెల్ నిర్మాణం చేశారు. రాయలసీమ ప్రజల చిరకాలవాంఛ అవుకు టన్నెల్.. గాలేరు నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ. 567.94 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన అవుకు ప్రాజెక్ట్ మొదటి, రెండు, మూడవ టన్నెల్, ఇతర అనుబంధ పనుల్లో భాగంగా కూడా ఇప్పటికే రూ.934 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయి. దీంతో ఇప్పటికే మొత్తం రూ. 1,501.94 కోట్ల విలువైన పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రేపు రెండో టన్నెల్ ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు.