Leading News Portal in Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌


Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

ఎలక్షన్ పోలింగ్ డేకు వరుణ గండం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం సర్వం సిద్ధమవుతున్న క్రమంలో రాష్ట్రానికి వాతావరణ కేంద్రం వర్ష సూచన ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా బలపడనుందని కేంద్ర వాతావరణ కేంద్రం ఇవాళ వెల్లడించింది. ఈ వాయుగుండం బంగాళాఖాతంలో వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందం, దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో ఉదయం నుండే మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, హైదరాబాద్‌తో పాటు పరిసర జిల్లాల్లో రేపు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాలకు తేలిక పాటి వర్షాలు కురియగా.. దక్షిణా తెలంగాణ జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఓటు వేసేందుకు సొంత ఊర్లకు ప్రజలు.. కిక్కిరిసిపోయిన జూబ్లీ బస్‌స్టాండ్
రేపు తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఊర్లకు బయలుదేరుతున్నారు. ఎక్కువగా యువత ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంత ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌స్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీబస్ స్టాండ్, ఎంజీబీఎస్‌లు జనాలతో నిండిపోయాయి. విద్యా, ఉపాధి, ఉద్యోగాల కోసం హైద్రాబద్ వచ్చిన వారంత ఓటు హక్కు మా బాధ్యత అంటూ సొంత ఊర్లకు పయనమవుతున్నారు. అయితే తగిన బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సుల్లో సీట్స్ ఫుల్ కావడంతో ప్రియాణికులు నిల్చుని మరి ప్రయానిస్తూ ఊర్లకు చేరుకుంటున్నారు. దీంతో రెగ్యులర్ బస్‌లతో పాటు ఎన్నికల కోసం ఉత్తర తెలంగాణ జిల్లాలకు రిజర్వేషన్‌ల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ పేర్కొంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నేడు, రేపు విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు సైతం ఇంటిబాట పడుతున్నారు.

జీహెచ్ఎంసీ యాప్ ద్వారా క్యూ లైన్ వివరాలు తెలుసుకునే అవకాశం
హైదరాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారిగా పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసే క్యూ లైన్ వివరాలు తెలుసుకునేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ వినూత్న చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలనే ఉద్దేశ్యంతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్ తెలుసుకునేందుకు పోల్ క్యూ రూట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును.. జీహెచ్ఎంసీ వెబ్ సైట్.. మై జీహెచ్ఎంసీ యాప్ లలో poll Q route యాప్ ను ఆక్టివేట్ చేశారు. అయితే, ముందుగా జీహెచ్ఏంసీ వెబ్ సైట్ లో వెళ్ళిన తర్వాత పోల్ క్యూ లైన్ నీ సెలెక్ట్ చేసుకోవాలి.. ఆ తర్వాత నియోజక వర్గం పేరు పోలింగ్ స్టేషన్ పేరు నమోదు చేసిన తర్వాత పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో నేవియేషన్ చూపిస్తుంది.. అయితే, ఎంత మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారో చూపిస్తుంది.. వెయిటింగ్ టైం కూడా చూపిస్తుంది.. ఈ క్యూ లైన్ సెక్టిర్ ఆఫీసర్ అప్ డేట్ చేస్తారు అని రోనాల్డ్ రోస్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన..
నిన్న మొన్నటి దాక సెంట్రల్ జైల్ లో ఉండి ఆరోగ్యం బాగా లేదనే సాకుతో బయటకు వచ్చి మమ్మల్ని ఓడిస్తాడా అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదు చంద్రసేన.. చంద్రబాబు టికెట్లు వేస్తే ఫ్లైట్ ఎక్కేది పవన్ కళ్యాణ్.. నారా లోకేశ్ పాదయాత్ర చేసినా దూకుడు యాత్ర చేసిన ఎప్పటికీ నాయకుడు కాలేడు అంటూ ఆయన విమర్శించారు. సోదరులకు సౌదరులు అని పిలిచే వ్యక్తి ఎమ్మేల్యే ఎలా అవుతాడు.. తెలంగాణ రాష్ట్రంలో గ్లాసు గుర్తుపై ఎనిమిది సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే చంద్రబాబు కాంగ్రెస్ కు ఓటు వెయ్యమంటున్నాడు.. ఆంధ్రాలో మాత్రం తెలుగుదేశానికి ఓటు వెయ్యమనడం నీతి, సిగ్గులేని రాజకీయం అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ ఓడిపోతారు..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను టీడీపీ నేతలు కలిశారు. సీఈవోను కలిసిన వారిలో అచ్చెన్నాయుడు, అశోక్ బాబు, ఇతర నేతలు ఉన్నారు. రాష్ట్రంలో ఓట్ల గల్లంతు, నకిలీ ఓట్లపై టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఎనిమిది జిల్లాల కలెక్టర్లపై సీఈఓకు టీడీపీ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్లు వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ చిత్తు చిత్తుగా ఓడిపోతారు అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ అదేశాలిస్తున్నా.. కలెక్టర్లు చెత్తబుట్టలో వేస్తున్నారు.. 8 జిల్లాల కలెక్టర్లు అడ్డగోలుగా పని చేస్తున్నారు అని అచ్చెన్నాయుడు తెలిపారు.

ఇజ్రాయిల్‌కి వ్యతిరేకంగా యూఎన్‌లో భారత్ ఓటు..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయిల్ ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానిన ఐక్యరాజ్య సమితి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ మద్దతుగా నిలిచింది. తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 91 దేశాల్లో భారత్ కూడా ఉంది. నవంబర్ 28, మంగళవారం రోజును దీనిపై ఓటింగ్ జరిగింది. తీర్మానం ప్రకారం.. ఇజ్రాయిల్ ఆక్రమించిన సిరియన్ గోలన్ నుంచి జూన్ 4, 1967 ముందు ఉన్న స్థానానికి వైదొగాలని పేర్కొంది. ఆక్రమిత గోలన్ హైట్స్ నుంచి వైదొలగానే తీర్మానానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతుగా నిలిచింది. ఇజ్రాయిల్, సిరియాల మధ్య గోలన్ ప్రాంతం ఉంది.

ముంబై, హైదరాబాద్ ఆఫ్ఘన్ కాన్సులేట్లు తిరిగి ప్రారంభం..
ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్ వెల్లడించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం, భారతదేశంలోని కాన్సులేట్లు, మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని స్టానిక్‌జాయ్ పేర్కొన్నారు. నయూమీ అనే వ్యక్తి భారత్ లోని దౌత్య కార్యాలయాలు మూసివేయబడ్డాయని, సేవలు అందించడం లేదని చెప్పాడు, అతని వాదనలు తప్పని తాలిబాన్లు స్పష్టం చేశారు. నవంబర్ 23 నాటికి భారత్‌లో ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు ఎవరూ లేరని, ఆ దేశ ఎంబసీ నవంబర్ 25న తెలిపింది.

ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ నా మనసును కదిలించింది
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన దూత ప్రమోషనల్ కంటెంట్ చాలా క్యూరియాసిటీని పెంచింది. డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చై.. వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు ఇస్తూ.. సిరీస్ పై ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

అడుక్కోవడం.. అలగడం తప్ప.. ఏమైనా చేస్తున్నావా బ్రో.. ?
జానకి కలగనలేదు సీరియల్ తో అమర్ దీప్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ తెచ్చిన పేరుతో వరుసగా డ్యాన్స్ షోలతో పాటు సినిమాల్లో కూడా మంచి అవకాశాలను అందుకున్నాడు. ఇక అలానే బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇక మొదటిరోజు నుంచి అమర్.. హౌస్ లో ఉండే విధానం.. చాలామందికి నచ్చకుండాపోయింది. గేమ్ అర్థంకాక కొన్ని వారాలు గడిపాడు. ఇక జుట్టు త్యాగం చేయకలేక కెప్టెన్సీ కంటెండర్ కాలేకపోయాడు. కొన్ని గేమ్స్ లో పౌల్స్ చేస్తూ.. మరి కొన్ని గేమ్స్ లో అతి తెలివి చూపిస్తూ.. 12 వారాలు అయినా కెప్టెన్ కాకుండానే మిగిలిపోయాడు. ఇక గత నాలుగువారాలుగా అమర్ ఆట అభిమానులకు నచ్చడం లేదన్నది వాస్తవం. గేమ్ ఆది ఓడిపోయిననప్పుడు ఆ బాధ ఎవరికైనా ఉంటుంది. ఆ ఓటమిని గెలుపుగా మార్చుకునేవాడే వీరుడు. కానీ, అమర్ మాత్రం ఆ ఏడుపును.. సింపతీగా, స్టాటజీగా మార్చుకున్నాడు. ఏడ్చింది కేవలం.. సింపతీ కోసమని, ఎవరైనా లొంగుతారేమోనని ఏడ్చినట్లు తనంతట తానే ఒప్పుకున్నాడు. ఇక చివరి కెప్టెన్సీ టాస్క్ లో అందరిని తనకు ఓటు వేయమని అడిగి.. నాగార్జున వచ్చినప్పుడు అడుక్కోవడం ఏంటి అని మాట మార్చేశాడు. ఏడుస్తున్నాడు అని పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేసిన అమర్.. తనవరకు వచ్చేవరకు ఆ బాధ తెలియలేదని తన ఏడుపును కవర్ చేసుకున్నాడు. ఇక ఈ వారం నామినేషన్ లో పల్లవి ప్రశాంత్ ఏడిస్తే.. మళ్లీ అదే మాటను గుర్తుచేసి నామినేట్ చేసాడు.