నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం దగ్గర తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొత్తం పదకొండు మంది యాత్రికులు గల్లంతయినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. వరద ఉధృతికి పదకొండు మంది పర్యాటకులు కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. రోప్ లతో పోలీసులు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇక, పెంచలకోన జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన పర్యాటకులు అందులోకి దిగడంతో నీటి ఉదృతికి కొట్టుకుపోయారని స్థానికులు చెప్పారు. అయితే వారంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు? అనే విషయం మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే, చివరికి పెంచలకోన జలపాతం వరద నీటిలో చిక్కుకున్న 11 మందిని పోలీసులు సురక్షితంగా రోడ్డుకు చేర్చారు. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో భయాందోళనకు గురైన యాత్రికులు.. మొదట 5 మందిని తీసుకువచ్చిన పోలీసులు.. ఇతర ప్రాంతంలో ఉన్న ఆరుగురిని పోలీసులు సురక్షితంగా కాపాడారు.