Leading News Portal in Telugu

Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎన్నికలు ఇప్పట్లో లేవు.. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే


Sajjala Ramakrishna Reddy: ఏపీలో ఎన్నికలు ఇప్పట్లో లేవు.. పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడే

విజయవాడలో బీసీ ఐక్యత సమగ్రాభివృద్ధి కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మంత్రి మెరుగు నాగార్జున, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ధిక వెనక బాటుతనం పోగొట్టడమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రపంచం మారుతున్నప్పుడు అందరం మారాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అవకాశాలు పెరుగుతున్నప్పుడు.. సాంకేతికత వచ్చినపుడు కులవృత్తులు కూడా మారతాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇస్తామంటున్న చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు. లేక ఉన్నత చదువు మారుతున్న భవిష్యత్ వైపు అడుగులు వేసే వారికి మద్దతు ఇవ్వాలా అనేది ఆలోచించాలి.. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒకటి కాదు మూడు చేస్తామని చెప్తాడు.. జగన్ రూపాయి చేస్తే బాబు పది చేస్తామంటాడు అని సజ్జల వెల్లడించారు. ప్రభుత్వం వల్ల మేలు జరిగింది అని నమ్మితేనే ఓట్లు వెయ్యండి అని జగన్ లాగా ఏ నాయకుడైన చెప్పగలరా.. బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం ఏమి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.