Leading News Portal in Telugu

Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్.. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేసిన పోలీసులు


Telangana Assembly Election 2023 : తెలంగాణ పోలింగ్.. ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేసిన పోలీసులు

Assembly Election 2023: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా నిన్నటి నుండే సరిహద్దు జిల్లాల్లో నిఘాను ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్ర సరి హద్దు జిల్లాల్లో నిఘా ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించేందుకు.. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. ఒక్కో బృందంలో పది మంది సభ్యులు ఉంటారని అయన తెలిపారు.

Read also:Asaduddin Owaisi: ఓటేసిన అసదుద్దీన్ ఒవైసీ

అలానే గురువారం మాట్లాడిన డీజీపీ.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులో 40 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామన్న అయన.. ఈ చెక్‌పోస్టులలో 15 మంది సివిల్ పోలీసులు, మూడు అటవీశాఖ బృందాలు, ఐదు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోలు, అలానే 17 మంది పోలీసులు, రవాణ, ఎస్‌ఈబీ, అటవీ, వాణిజ్య పన్నులకు సంబంధించిన అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా రౌడీషీట్‌లు, నేర చరిత్ర ఉన్న 54 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ పేర్కొన్నారు.