
Nellore: సాగర్ డ్యాం దగ్గర నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. వివరాలలోకి వెళ్తే.. తాజాగా మీడియాతో సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ బిల్లు అమలు చేసి తీరుతాం అని అమిత్ షా చెప్తున్నారు.. అలానే దేశం లోని అన్ని ప్రతిపక్ష పార్టీలు కుల గణన కావాలని పట్టుబడుతున్నాయి.. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కుల గణన నిర్వహణ ఏ విధంగా చేయబోతోంది అని ప్రశించారు. కాగా Citizen Amendment Act (సి.ఏ.ఏ.)కు వైసీపీ అలానే టిడిపి రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.
Read also:Hyderabad Metro: ఎలక్షన్ ఎఫెక్ట్.. జనాల్లేక బోసిపోయిన మెట్రో
ఈ క్రమంలో సామాజిక న్యాయానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీవీ రాఘవులు ఆరోపించారు. కాగా ఈ విషయం పైన వైసీపీ అలానే టిడిపి నేతలు వారి వైఖరి తెలపాల్సిందగా కోరారు. ఈ క్రమంలో ఈ విషయం పై ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా వైసీపీ డిమాండ్ చెయ్యాలని సూచించారు. కాగా నాగార్జున సాగర్ డ్యాం దగ్గర రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు మధ్య తలెత్తిన ఘర్షణ పై ఆయన స్పందించారు. ఇలా సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం నిజంగా చాల బాధాకరం అని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.