Leading News Portal in Telugu

Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం


Pawan Kalyan: ఆ రెండు భావజాలాలు నాకు ఇష్టం.. ఒక తాటిపైకి తేవాలన్నదే నా ఉద్దేశం

Pawan Kalyan: సనాతన భావజాలం, లెఫ్ట్ భావజాలం అంటే ఇష్టం నాకు.. రెండూ ఒక తాటిపైకి తేవాలన్నది నా ఉద్దేశం అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కొందరు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీ కండువా కప్పి వారిని జనసేనలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ.. దాశరధి రంగాచార్య, కృష్ణమాచార్య కూడా సనాతన విధానాలు పాటించినా.. వామపక్ష విధానాలతో ఉద్యమించారని గుర్తుచేశారు.. 2019లో పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను ఆహ్వానిస్తే ఈ ఎన్నికల్లో జనసేన ఇండిపెండెంట్ గా పోటీ చేసేది.. 2004, 2005 నుంచి నేను దళిత, బీసీ కులాల నాయకులతో తిరిగే వాడిని.. అధికారం చూడని కులాలకి నిజమైన సాధికారత ఇవ్వాలని ఆలోచించాను అని తెలిపారు.

బీసీ నేతలను మంత్రిని చేసి నిర్ణయాత్మక శక్తి లేకుండా చేయడం సాధికారత కాదన్నారు పవన్‌ కల్యాణ్‌.. వెనుకబడిన కులాలు ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని పిలుపునిచ్చారు. ఒంటరితనం అనుభవించి, అవమానాలు పడ్డాను.. ప్రతికూల పరిస్ధితుల్లో పార్టీ పెట్టాను అని గుర్తు చేసుకున్నారు. ఒక కులాన్ని ఆధారం చేసుకుని పాలిటిక్స్ చేయలేం.. మూడో ఎన్నికకు వచ్చేసరికి భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ మారిపోయిందని గుర్తు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. మన కులాన్ని మనం సంరక్షించుకుంటూనే.. మన పక్కన ఉన్న కులాలను కలుపుకు వెళ్ళాలి.. అని గద్దర్ చెప్పారు.. గొడవలకు కులాలను వాడతారు.. కానీ, ఎన్నికల్లో అది కనిపించదు అన్నారు. సామాజిక తెలంగాణ అని 2009లోనే చూపించేవాళ్లం.. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ ప్రభుత్వం వస్తుంది. నేను ఎవరికి కొమ్ము కాయను… నాయకులు ప్రతీరోజూ కొట్టుకుంటే.. కార్యకర్తలు తలలు పగులకొట్టుకుంటారు. ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్‌ను దాటి కార్యకర్తల్లో ఒకరు జనసేనను నడపాలన్నారు.

దేవాలయాలకి డబ్బులు పంపమని తల్లి చెపితే.. జనసేనకు డబ్బులు పంపుతున్నాడు ఒకాయన.. నేను వ్యక్తులను ఎన్నుకునేప్పుడు కులాలను చూడను గుణగణాలు చూస్తా అన్నారు పవన్‌.. ఓటుకు ఐదు వేలు ఇచ్చి కొంటూ అవినీతి గురించి మాట్లాడకూడదు.. రాజశేఖరరెడ్డి హయాంలోనే కోట్లు సంపాదన ఉన్నవాడిని నేను అని గుర్తు చేసుకున్నారు. నేను ఈగోలకు వెళ్లను, ఛాన్సులు తీసుకోదలచుకోలేదు.. ఏపీ ప్రజలు గెలవాలనుకుంటున్నాను.. విభజన సమయంలో పార్టీ నిలబడెట్టుకోలేకపోయాం.. పొలిటికల్‌ అలజడి అతలాకుతలం చేసిందన్నారు. తెలివి లేక, వ్యూహం వేయలేక పార్టీ నిలబెట్టుకోలేకపోయా.. పుస్తకం పట్టుకోలేని వాడు, నా దృష్టిలో పడాలని చూసిన వాడు ఎమ్మెల్యే అయ్యాడు.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నిలబెట్టుకో లేకపోయాం అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి జనసేన విస్తృత భావజాలం నచ్చిందని ఈ సందర్భంగా వెల్లడించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.