Leading News Portal in Telugu

Payyavula Keshav: ఈసీ నిర్ణయంపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..


Payyavula Keshav: ఈసీ నిర్ణయంపై పయ్యావుల కీలక వ్యాఖ్యలు..

Payyavula Keshav: ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందన్న ఆయన.. ఇక, బల్క్ ఫారమ్-7 డిలీషన్స్ చెల్లవు.. బల్క్ ఫారమ్- 7 అప్లికేషన్లు ఆన్ లైన్ లో తీసుకోవద్దని సీఈసీ ఆదేశించిందని తెలిపారు. దొంగ ఓట్లను తొలగించాలంటే ఫిజికల్ గానే ఫారమ్ 7 తప్పని సరి.. రాజకీయ నాయకులు వినతి పత్రాలు ఇస్తే ఓట్లను తొలగించడానికి లేదని స్పష్టం చేశారు. ఇక, పయ్యావుల కేశవ్ ఎవర్నీ బ్లాక్ మెయిల్ చేయడు.. ఏది చేసినా వైట్ పేపర్ తో మాట్లాడతానన్న ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బతుకు అంతా బ్లాక్ మెయిలే అని మండిపడ్డారు.. ఓటు హక్కు ఎక్కడ ఉండాలనేది ఓటరు ఇష్టం.. మధ్యలో మీది ఏంటి? అని నిలదీశారు. ఉరవకొండలో మేం చేసిన పోరాటం వల్ల ఎన్నికల సంఘం స్పందించిందన్నారు. కానీ, విశ్వేశ్వరరెడ్డి కలెక్టర్ ను, ఎమ్మార్వోలను కూడా పని చేసుకోనివ్వడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు జరిగితే.. చట్టాన్ని పరిరక్షించమని ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు అయినా అడుగుతాం అన్నారు. విశ్వేశ్వరరెడ్డి చేసిన తప్పులకు ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారని ధ్వజమెత్తారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.