Leading News Portal in Telugu

Cyclone Michaung: విరిగిపడుతున్న కొండచరియలు.. అరకులోయ ఘాట్‌ రోడ్డు మూసివేత


Cyclone Michaung: విరిగిపడుతున్న కొండచరియలు.. అరకులోయ ఘాట్‌ రోడ్డు మూసివేత

Cyclone Michaung: ఆంధ్రప్రదేశ్‌లో మిచౌంగ్‌ తుఫాన్‌ విధ్వంసం సృష్టించింది.. భారీ ఎత్తున పంట నష్టం జరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.. పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్‌ విజృంభణతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. మరోవైపు.. ఇంకా వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు.. అల్లూరి ఏజెన్సీలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి.. దీంతో.. ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది.. అప్రమత్తమైన అధికారులు అరకులోయ వెళ్లేందుకు వాహనాల అనుమతులు నిలిపివేశారు.. చిలకల గడ్డ దగ్గర అరకులోయ వెళ్లే వాహనాల నిలిపివేస్తున్నారు.. దీంతో.. పర్యాటకులు, ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వస్తుంది..

ఇక, వర్షాలకు ఘాట్ రోడ్ కొండచరియలు విరిగిపడుతుండడంతో.. అప్రమత్తమైన అధికారులు.. వాహనాల రాకపోకలు నిలిపివేశారు.. బోర్డర్‌ చెక్ పోస్టు వద్దే వాహనాలను నిలిపివేస్తున్నారు సిబ్బంది.. దీంతో.. ఎస్ కోట, అరకు రోడ్డులో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.. మరోవైపు.. ఈశాన్య తెలంగాణ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్-దక్షిణ అంతర్గత ఒడిశా-కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌పై నున్న వాయుగుండం బలహీనపడి అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతున్నది. మరియు దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈశాన్య తెలంగాణ మరియు దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్‌గఢ్-దక్షిణ అంతర్గత ఒడిశా-కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌పై బలహీనపడి అదే ప్రాంతంలో బాగా గుర్తించబడిన అల్పపీడన ప్రాంతంతో అనుబంధమైన ఉపరిత ఆవర్తనం నుండి ఉపరితల ద్రోణి ఒకటి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0 .9కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. వీటి ప్రభావంతో.. రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.