Leading News Portal in Telugu

Cyclone Michaung: ఏపీలో తగ్గని వర్షాలు.. రేపు కూడా అక్కడ సెలవే


Cyclone Michaung: ఏపీలో తగ్గని వర్షాలు.. రేపు కూడా అక్కడ సెలవే

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్‌ ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై కొనసాగుతూనే ఉంది.. తుఫాన్‌ బీభత్సం సృష్టిస్తోంది. ఈ నెల 5వ తేదీన బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్.. వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా కురిశాయి.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి.. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఇప్పటికీ భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు అధికారులు.. ప్రస్తుతం తుఫాన్ బలహీనపడుతున్నప్పటికీ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.. ఇక, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. రేపు అనగా గురువారం రోజు కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ సుమిత్ కుమార్. భారీ వర్షాలు కురుస్తుండటంతో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు సెలవు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్‌.