
Varahi Yatra: మరోసారి వారాహి యాత్ర నిర్వహించనున్న ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖలో నిర్వహించిన బహిరంగ సభ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు.. వారాహి యాత్ర మళ్లీ చేస్తాం.. మూడు నెలలు నాయకులు అంతా కలిసి పనిచేద్ధాం అని పిలుపునిచ్చారు.. టీడీపీ-జనసేన పొత్తు కోసం ఎవరు మాట్లాడినా వాళ్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినట్టే భావిస్తాం అన్నారు. జీరో బడ్జెట్ ఎలక్షన్ నేను నమ్మను.. బలమైన ఎలక్షన్ ఇయరింగ్ జరగాలన్నారు. ప్రతీ ఓటర్ ను పోలింగ్ బూతుకు చేరిస్తేనే టీడీపీ-జనసేన ప్రభుత్వం ఖాయంగా వస్తుందన్నారు.. మూడు నెలల్లో వైసీపీని ఇంటికి పంపేద్దాం.. దశాబ్దం పాటు మనం అధికారంలో ఉండాలి.. ఆ తర్వాత వైఎస్ జగన్ మారితే అప్పుడు ఆలోచిద్దాం అని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నాలుగు విడతలుగా వారాహి యాత్ర నిర్వహించారు పవన్ కల్యాణ్.. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నంలో పర్యటించిన ఆయన.. అధికార పక్షంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. ఇక, టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించిన తర్వాత.. అక్టోబర్‌లో నాల్గో విడత వారాహి యాత్ర నిర్వహించారు.. నాల్గో విడత యాత్ర కృష్ణా జిల్లాలోని ప్రధాన నియోజకవర్గాల్లో కొనసాగింది.. తొలి విడత వారాహి యాత్రలో వ్యక్తులపై, రెండవ విడతలో వ్యవస్థలపై విరుచుకుపడ్డారు. నాల్గో విడతలోనూ అదే దూకుడు చూపించారు.. మరి.. ఐదో విడత వారాహి యాత్ర ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఏ జిల్లాల్లో సాగనుంది అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.