Leading News Portal in Telugu

Governor Abdul Nazeer: సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలి-గవర్నర్‌


Governor Abdul Nazeer: సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలి-గవర్నర్‌

Governor Abdul Nazeer: సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలని ఆకాక్షించారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలని ప్రజలందరికీ తెలియజెప్పడానికే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం అన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఈ పథకాలు అందించడమే ఈ యాత్ర లక్ష్యం.. సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ‌పథకాలపై అందరికీ అవగాహన కల్పించడం‌కోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు.

ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ క్రెడిట్, పీఎం పోషణ్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, పీఎం ఉజ్వల్ యోజ్ రోజ్ గార్ మేళా.. ఇలా కీలక సంక్షేమ‌ పథకాలని కేంద్రం అందిస్తోందన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. ప్రజల అవసరాలని గుర్తించి వాటిని నెరవేర్చడమే ప్రభుత్వాల‌ లక్ష్యం అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలని అందించడంలో ముందుంది.. మహిళాభివృద్దికి ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకి 15 వేల డ్రోన్ లు అందించడం జరుగుతుందన్నారు.

వ్యవసాయంలో డ్రోన్ కెమెరాల వినియోగంపై మహిళలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌.. వచ్చే 25 సంవత్సరాలలో భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే 25 ఏళ్ల కాలం భారత దేశానికి అమృతకాలం అన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి పాల్గొంటేనే ఈ కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌..