
Posani Krishna Murali: నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి.. అందులో 38 మందిని నంది అవార్డులకు ఎంపిక చేశారు.. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరుగుతందన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ.. ఈ నెల 23వ తేదీన నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ 38 మంది 23న నాటక ఉత్సవాల్లో ప్రదర్శన ఇస్తారు.. మేం పూర్తిగా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాం అన్నారు. ఇక, ఎలాంటి సిఫార్సులకు తావు లేదు అని స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శకంగా అవార్డులకు ఎంపిక చేయాలని ఆదేశించారని గుర్తుచేసుకున్నారు.
18 మంది ఉత్తమ నిపుణులు, కళాకారులను జడ్జీలుగా ఎంపిక చేశారు.. న్యాయ నిర్ణేతల ఎంపికలో లోపాలను ఎవరైనా చూపిస్తే వారిని కూడా మార్పు చేస్తాం అన్నారు పోసాని. వైఎస్ఆర్ పురస్కారాన్ని కూడా ఇస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావు లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తం 74 అవార్డులను ఇస్తాం.. 5 కేటగిరీలలో అవార్డులను ఇస్తాం అన్నారు ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ. మరోవైపు.. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ ఎండీ విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నాం.. పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నారు.. అవార్డుల ఎంపికకు ప్రముఖ నాటకరంగం వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు విజయకుమార్ రెడ్డి.