Leading News Portal in Telugu

Kakani Govardhan Reddy: టీడీపీ హయాంలో అభివృద్ది పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారు..


Kakani Govardhan Reddy: టీడీపీ హయాంలో అభివృద్ది పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారు..

Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మంత్రి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపనలతో పాటు అభివృద్ధి పనులు కూడా ప్రారంభిస్తున్నామన్నారు. తుఫాను వల్ల పలు ప్రాంతాల్లో జిల్లాలో పలుచోట్ల నారుమళ్లు నీట మునిగాయని.. రైతులకు సబ్సిడీతో విత్తనాలను అందిస్తున్నామన్నారు.

సైదాపురంలో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని సోమిరెడ్డి నానా హడావిడి చేశారని.. వాటాలకు సంబంధించి 24 గంటల్లోనే ఒప్పందం కుదరడంతో ప్రస్తుతం దాని గురించి మాట్లాడటం లేదన్నారు. ఇప్పుడు పొదలకూరులో జరుగుతోందని అంటున్నారని.. ఆ గనుల యజమానులు వచ్చి ఇంకా మాట్లాడినట్లు లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మండలం తరువాత ఇంకో మండలానికి వెళతారని.. వ్యాపారం, బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌లు చేయడమే ఆయన నైజమన్నారు.