Leading News Portal in Telugu

SP Jagadish: రౌడీ మూకలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్.


SP Jagadish: రౌడీ మూకలకు ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్.

SP Jagadish: బరితెగిస్తే జైలుకే అంటూ రౌడీమూకలకు సీరియన్‌ వార్నింగ్‌ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్.. బ్లేడ్ బ్యాచ్ పై ఉక్కు పాదం మోపుతాం అన్నారు.. రాజమండ్రి మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపించారు జిల్లా ఎస్పీ.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బరితెగిస్తే జైలుకు పంపుతాం అంటూ హెచ్చరించారు. ఇక, రౌడీషీటర్లు, అల్లరి మూకలు, అలవాటుపడిన నేరస్తుల గుండెల్లో దడలు పుట్టిస్తోంది జిల్లా పోలీసు యంత్రాంగం. కయ్యానికి కాలు దువ్వినా, సెటిల్మెంట్లకు రంగంలోకి దిగినా, చట్ట వ్యతిరేకమైన నేరాలలో తరుచూ పాల్గొన్నా.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్. ప్రజా శాంతికి భంగం కలిగిస్తూ, అయితే, చట్టాలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్నవారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ హడలెస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి. జగదీష్.

కాగా, తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా 2017 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన పి.జగదీష్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో నియమించింది ప్రభుత్వం.. దీంతో, అనంతపురంలోని 14వ బెటాలియన్‌ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తోన్న ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.. అప్పటి నుంచి రౌడీమూకల విషయంలో కఠినంగా ఉంటున్నారు.. బ్లేడు బ్యాచ్‌ ఆగడాలు, రాత్రి సమయాల్లో దాడులు వంటి కేసులును సీరియస్‌గా తీసుకొని.. వాటిపై దృష్టి సారిస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రౌడీ మూలకు వార్నింగ్‌ ఇచ్చారు.