
Pawan Kalyan: వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీల నేతలు విస్తృత పర్యటనలకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ సారి ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన పర్యటనల కోసం ప్రత్యేక హెలికాప్టర్ వాడనున్నారనే ప్రచారం సాగుతోంది.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత పర్యటనలకు జనసేనాని ప్లాన్ చేస్తున్నారట.. ప్రతి జిల్లానూ కనీసం మూడు సార్లు టచ్ చేసేలా పవన్ కల్యాణ్ ప్రణాళికలు సిద్ధం చేశారని జనసేన పార్టీ శ్రేణులు చెబుతున్నమాట.. మొదటి దశ పర్యటనలో జిల్లా ముఖ్యనేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారట జనసేనాని.. పార్టీ పరిస్థితి, బలం, పోటీచేస్తే సాధించే ఓట్లు తదితర అంశాలపై దృష్టిసారిస్తారట.. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రచారంలో జిల్లాలను చుట్టేసే విధంగా ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది..
ఇక, ఇప్పటికే అటు బీజేపీతోనూ.. ఇటు తెలుగుదేశం పార్టీతోనూ పొత్తు కలిగి ఉంది జనసేన పార్టీ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి ముందుకు సాగేలా ప్రయత్నాలు సాగుతున్నాయి.. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపివచ్చారు. పొత్తులో భాగంగా వారి ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఏపీ బీజేపీ ముఖ్యనేతలో కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. మరి మూడు పార్టీలు కలిసి నడిచే విషయంలో ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచిచూడాలి. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే తమ లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. ఈ సారి ప్రచారంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడతారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి తరపున మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారట.. ప్రతి జిల్లాకు పవన్.. మూడుసార్లు వెళ్లేలా ప్రణాళిక సిద్దం చేసినట్లు జనసేన ప్రకటించింది. మొదటిసారి జిల్లా ముఖ్యనేతలతో, రెండోసారి స్థానిక కార్యకర్తలతో సమావేశం, మూడోసారి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం, బహిరంగ సభల్లో పవన్ కల్యాణ్ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట.. ఇందులో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాల్లో ఫిబ్రవరి 14వ తేదీ నుంచే జనసేనానిని పర్యటన ప్రారంభం కాబోతోంది.. 14 నుంచి 17 తేదీ వరకు ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇందుకోసం హెలికాప్టర్ రెడీగా వున్నట్లు జనసేన నాయకులు చెబుతున్నమాట..