Leading News Portal in Telugu

Andhra Pradesh Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవర్స్‌ డే రోజు ప్రాణాలు విడిచింది..!


Andhra  Pradesh Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవర్స్‌ డే రోజు ప్రాణాలు విడిచింది..!

Andhra Pradesh Crime: ప్రేమికుల రోజు నాడే ఏపీలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది.. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామానికి చెందిన జొన్నాడ సత్య దుర్గా ప్రసాద్.. ముమ్మిడివరం మండలం సోమిదేవరపాలెం గ్రామానికి చెందిన పెయ్యల దుర్గలు.. కొంత కాలం ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత 2022లో పెద్దల సమక్షంలో పేళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.. అయితే, గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు..


ఇక, మీ కూతురు ఆరోగ్యం బాగోలేదంటూ.. దుర్గ తల్లిదండ్రులకు ఫోన్‌ చేశాడు దుర్గా ప్రసాద్.. హుటాహుటిన బయలుదేరి.. కూతురు ఇంటికి వెళ్లిన దుర్గ తల్లిదండ్రులు షాక్ తిన్నారు.. ఆమె మరణించి ఉండడంతో మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.. అల్లుడు దుర్గాప్రసాదే తమ కుమార్తెను కొట్టి చంపాడని వారు ఆరోపిస్తున్నారు.. దుర్గ సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా దుర్గ ప్రాణాలు తీసుకుందా? నిత్యం గొడవలు జరుగుతుండడంతో.. దుర్గాప్రసాదే.. దుర్గ ప్రాణాలు తీశాడా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.. మొత్తంగా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న ఓ యువతి ప్రాణాలు.. ప్రేమికుల రోజు నాడే పోవడం విషాదంగా మారింది.