
Kethireddy Pedda Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరో ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు డీజిల్ బిల్లులు, ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డీజిల్ బిల్లుల వ్యత్యాసం ప్రజలు గమనించాలని కేతిరెడ్డి పేర్కొన్నారు.
తాడిపత్రిలో ఆలీబాబా 40 దొంగలు ఉన్నారని.. ఆలీబాబా 40 దొంగల నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. మా పార్టీ జెండా కింద ఉండి ఇతర పార్టీకి మద్దతు పలికే వారికి సిగ్గు శరం ఉంటే పార్టీ వదిలి వారి బస్సులను క్లీన్ చేయాలన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా తనకే ఫోను వస్తుందని అంటే తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ లేనట్లే కదా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు.