
CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్నారు సీఎం.. ఇక, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. కర్నూలు పర్యటన కోసం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి కర్నూలుకు చేరుకోనున్న సీఎం జగన్.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదిస్తారు.. ఆ తర్వాత తిరిగి తాడేపల్లి చేరుకుంటారు..
మరోవైపు.. నేడు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.. ఫిరంగిపురంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.. ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.. ఫిరంగిపురం మండలం రేపుడిలో ప్రత్యేక హెలిపాడ్ నిర్మాణం చేశారు.. అదే ప్రాంతంలో భారీ సభా వేదికను సిద్ధం చేసింది అధికార యంత్రాంగం. ఇక, ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఫిరంగిపురం మండలం రేపూడి చేరుకోనున్న సీఎం జగన్.. వలంటీర్ల అభినందన సభలో పాల్గొంటారు.. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.