Leading News Portal in Telugu

Mekathoti Sucharita: దండాలయ్యా.. మహారాజై నువ్వు ఉండాలయ్యా.. జగన్‌పై పాటపాడిన సుచరిత


Mekathoti Sucharita: దండాలయ్యా.. మహారాజై నువ్వు ఉండాలయ్యా.. జగన్‌పై పాటపాడిన సుచరిత

Mekathoti Sucharita: హరిత విప్లవం నీలి విప్లవం వచ్చాయని.. ఉద్యోగ విప్లవం తెచ్చింది సీఎం జగన్ మోహన్ రెడ్డేనని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. చంద్ర బాబు హయాంలో బాబు వస్తే జాబు వస్తోంది అని నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించింది వాలంటీర్‌ సైనికులేనని ఆమె ప్రశంసలు గుప్పించారు. దండాలయ్యా . దండా లయ్యా మహారాజులాగా ఎప్పటికీ ఉండాలయ్యా అంటూ పాట పాడుతూ సీఎంపై పొగడ్తల వర్షం కురిపించారు. సూర్యుడు వస్తాడో రాడో తెలియదు కానీ 1వ తారీఖు ఉదయం పూట వాలంటర్ అవ్వ తాతకి పెన్షన్లు అందజేస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. వృద్ధాప్య పెన్షన్లను 5 వేలకు పెంచాలని సీఎం జగన్‌ను కోరారు. ఫిరంగిపురంలో ఉన్న కార్మెల్ మాత కొండపై ఘాట్ రోడ్డు వేయడానికి నిధులను విడుదల చేయాలని కోరారు.