Leading News Portal in Telugu

Prabhakar Chowdary: పవన్‌ కల్యాణ్‌ కోసం త్యాగానికి రెడీ..! నా స్థానంలో పోటీ చేస్తే స్వాగతిస్తా..


Prabhakar Chowdary: పవన్‌ కల్యాణ్‌ కోసం త్యాగానికి రెడీ..! నా స్థానంలో పోటీ చేస్తే స్వాగతిస్తా..

Prabhakar Chowdary: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోసం తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధం అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ విషయంలో గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను అన్నారు.. తెలుగుదేశం – జనసేన పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్‌ అనంతపురంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తానని స్పష్టం చేశారు.. గెలుపు కోసం నా భుజస్కంధాలపై వేసుకొని పవన్ కల్యాణ్‌ గారిని గెలిపించేడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఈ విషయంపై నేను పార్టీ శ్రేణులను నచ్చజెప్పి పవన్ కల్యాణ్‌ను గెలిపిస్తానని వెల్లడించారు ప్రభాకర్ చౌదరి.


టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. సీట్ల వ్యవహారంపై చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది.. కొన్ని సీట్లపై ఓ నిర్ణయానికి వచ్చినా.. మరోవైపు.. బీజేపీ పొత్తు వ్యవహారం తేలితే మరికొంత క్లారిటీ వస్తుంది అంటున్నారు.. ఇదే సమయంలో అనంతపురం అర్బన్ నుంచి బరిలోకి దిగేది ఏ పార్టీ.. టీడీపీదా.. జనసేనకా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు వెళ్లోందని ప్రచారం కొనసాగుతోంది.. దీంతో టీడీపీ ఇంఛార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. స్థానిక టీడీపీ నేతలు మాత్రం ప్రభాకర్‌ చౌదరికే సీటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ప్రభాకర్ చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. జనసేన అధినేత పవన్ కల్యాన్‌.. అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తే.. తాను తప్పుకుంటాను అంటున్నారు. మరి, అనంతపురం స్థానం పొత్తులో ఏ పార్టీకి వెళ్తుందో వేచిచూడాలి.