Leading News Portal in Telugu

Ratha Saptami 2024: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి


Ratha Saptami 2024: అరసవల్లిలో రథసప్తమి వేడుకలు.. శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి వీఐపీల తాకిడి

Ratha Saptami 2024: శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. అసరవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో.. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు వేదపండితులు. వేదపారాయణoతో ఆదిత్యుని మూలవిరాట్ కి క్షీరాభిషేకo నిర్వహించారు ఆలయ పండితులు.. క్షీరాభిషేకం అనంతరం త్రిచ, చౌరం, ఆరుణం, నమకం, చమకాలతో అభిషేకపూజలు నిర్వహించారు.. మాఘమాసం రథసప్తమి సందర్బంగా నిజరూపదర్శనంలోభక్తులకు కనువిందు చేస్తున్నారు సూర్యభగవానుడు.


ఏడాదికి ఒక రోజు నిజరూపంలో దర్శనమిస్తున్న తమ ఇష్టదైవాన్ని దర్శించేందుకు రాత్రి ఎనిమిది గంటల నుండే క్యూ లైన్లలో వేచివున్నారు భక్తులు.. సాధారణ భక్తులతో పాటు వీఐపీల తాకిడితో కిటకిటలాడుతోంది అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం. మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మేల్యేలు గోర్లే కిరణ్, విశ్వసరాయి కళావతి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణితో పాటు తెలంగాణలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహా పలువురు వీఐపీలు సూర్యదేవుడిని దర్శించుకున్నారు. ఇక, రథ సప్తమి సందర్భంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి ఆలయంలో.. ఆధిత్యుని నామస్మరణతో మారుమోగుతున్నాయి ఆలయ పరిసర ప్రాంతాలు..