
Free Global Courses: విద్యా వ్యవస్థ ప్రక్షాళనపై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పటికే విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు.. రాష్ట్ర విద్యార్థులను జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేలా చర్యలకు పూనుకుంటున్నారు.. ఏపీ విద్యార్థులకు ప్రపంచ యూనివర్సిటీ అధ్యాపకుల బోధనకు సిద్ధం అవుతున్నారు.. సుమారు 2 వేలకు పైగా వరల్డ్‌క్లాస్ కోర్సులు ఉచితంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి వర్సిటీల సర్టిఫికేషన్లు అందించనున్నారు.. దీని వల్ల ఏకంగా రాష్ట్రంలోని 12 లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల్లో భాగంగా ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఒప్పందానికి సిద్ధం అయ్యింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఎడెక్స్ ఆన్‌లైన్ లెర్నింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిస్తారు.
అయితే, ఇప్పటికే ఎడెక్స్, ఏపీ ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధన విధానాలను రూపొందించాయి. హార్వర్డ్, ఎంఐటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనావిుక్స్, కొలంబియా, న్యూయార్క్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ప్రపంచస్థాయి యూనివర్సిటీల నుంచి వివిధ కోర్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు సర్టిఫికేషన్లు సులభంగా పొందే వీలు కలగనుంది.. దీని ద్వారా మంచి వేతనాలతో కూడిన జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగాలను సాధించేలా.. విద్యార్థులను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. రాష్ట్రంలోని 12 లక్షల మందికి పైగా విద్యార్థులు వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2000 పైగా ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను, రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకునే వీలును ప్రభుత్వం కలిపిస్తోంది.. తద్వారా ఎడెక్స్, అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు అందుకునే వెసులుబాటు కలుగుతుంది.
మొత్తంగా.. ప్రముఖ ఆన్‌లైన్ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో ఏపీ ప్రభుత్వం ఈ రోజు ఒప్పందం చేసుకోనుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫాం “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదరనుంది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను ఎడెక్స్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ సంయుక్తంగా రూపొందించాయి. వరల్డ్ క్లాస్ వర్సిటీలు, ఇతర విద్యాసంస్థలు అందించే 2,000+ ఎడెక్స్ ఆన్లైన్ కోర్సులను రెగ్యులర్ కోర్సులతో పాటు ఉచితంగా చదువుకుని, సర్టిఫికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలు, సంస్థలకు చెందిన అత్యుత్తమ అధ్యాపకులతో రాష్ట్ర విద్యార్థులకు బోధన అందించనున్నారు. హార్వర్డ్, ఎంఐటీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి సహా పలు అత్యుత్తమ వర్సిటీల నుంచి ఆ కోర్సు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ కానున్నాయి. ఈ ఆన్‌లైన్ కోర్సులు చేయడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు మంచి వేతనాలతో జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.