
CM YS Jagan: విద్యారంగంలో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో.. ఏపీ ప్రభుత్వ అధికారులు, ఎడ్‌క్స్ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది అన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత నినాదం.. నాణ్యమైన విద్య అన్నది హక్కు.. ఇది కొత్త నినాదం అన్నారు. నాణ్యమైన విద్యను అదించడంలో మనం వెనకబడితే.. మిగతా వాళ్లు మనల్నిదాటి ముందుకు వెళ్లిపోతారు.. ఈ దేశంలో ఉన్నవారితోకాదు మన పోటీ.. ప్రపంచంతో మనం పోటీపడుతున్నాం.. మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సాధించాలి.. మంచి మంచి జీతాలు సంపాదించాలి.. నాణ్యమైన విద్యద్వారానే ఇది సాధ్యం అన్నారు.
Read Also: Ullu Digital IPO : త్వరలో ఐపీవోకు రానున్న ఉల్లు.. రికార్డులు బద్ధలే
విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి.. అప్పుడు మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయి అన్నారు సీఎం వైఎస్ జగన్.. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే.. ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చు.. కానీ, ఎక్కడో ఒకచోట ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు.. ఫలాలు ఇవ్వాలంటే బహుశా నాలుగైదేళ్లు పట్టొచ్చు అన్నారు. అయితే, మనం వేసిన ప్రతి అడుగు కూడా ప్రాథమి విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకూ కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నాం.. మానవవనరుల మీద పెట్టుబడి అన్నది ఒక ప్రధాన అంశంగా మన ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే ప్రతి అడుగులోనూ కూడా చిత్తశుద్ధి, అంకిత భావం చూపిస్తున్నాం అని వెల్లడించారు.
Read Also: Coach Jai Simha: నేను మద్యం సేవించలేదు.. కూల్ డ్రింక్ మాత్రమే తాగాను: కోచ్ జై సింహా
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాం.. గ్లోబల్ సిటిజన్ కావాలంటే మన మాట్లాడే భాషలో మార్పులు రావాలి.. ప్రపంచస్థాయితో పోటీపడాలి.. అలా చేయకపోతే మన భవిష్యత్తు మారదు అన్నారు సీఎం వైఎస్ జగన్.. అందుకనే ఇంగ్లీషు మీడియం నుంచి నాడు-నేడు, అమ్మ ఒడి, గోరుముద్దతో మన ప్రయాణం ప్రారంభమైంది.. అక్కడితో మనం ఆగిపోలేదు .. వచ్చే పదేళ్లలో టెన్త్ విద్యా్ర్థి ఐబీ విద్యాబోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.
Read Also: PM Modi Degree Case: మోడీ విద్యార్హతపై పరువు నష్టం కేసు.. తిరస్కరించిన గుజరాత్ హైకోర్టు
కాగా, ఉన్నత విద్యారంగంలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు.. నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ స్థాయి వర్సిటీ కోర్సులను ఆన్‌లైన్ ద్వారా అందించే ప్రముఖ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ “ఎడెక్స్”ల మధ్య ఒప్పందం కుదిరింది. టీచింగ్, లెర్నింగ్ కోసం కొత్త టెక్నాలజీ, బోధనా విధానాలను సంయుక్తంగా ఎడెక్స్ మరియు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రూపొందించాయి.