Leading News Portal in Telugu

GSLV F14: జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌14 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్..



Gslv

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. మధ్యాహ్నం ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం 2.05 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 27 గంటల 30 నిమిషాల కౌంట్ డౌన్ అనంతరం.. రేపు సాయంత్రం 5.35 గంటలకు శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.

Read Also: Australia floods: ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు.. భారతీయురాలి మృతి

ఈ రాకెట్ ద్వారా 2 వేల 275 కిలోల బరువు కలిగిన INSAT-3DS అనే ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగిస్తుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ సమాచార ఉపగ్రహం ద్వారా భూమి ఉపతరితలం, పర్యావరణాన్ని పర్యవేక్షించడం, వాతావరణ ఫ్రొఫైల్ డేటాను అందించడం, డేటా సేకరణ, వ్యాప్తిని సులభతరం చేయడం, ఉపగ్రహ సహాయక శోధన, రెస్క్యూ సేవలను అందించడం ఈ మిషన్ ముఖ్యమైన లక్ష్యాలు. దీని అభివృద్ధిలో భారత్కు చెందిన పలు కంపెనీలు ముఖ్య పాత్ర పోషించాయి. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read Also: Bandi Sanjay: ఎట్టి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు..