
Kesineni vs Kesineni: మరోసారి తన సోదరుడు, బెజవాడ ఎంపీ కేశినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని.. కేశినేని నాని ఊసరవెల్లి.. టీడీపీలో ఉంటూ వైసీపీ కోసం కేశినేని నాని పని చేశాడు.. ఢిల్లీలో నారా లోకేష్ ఏయే లాయర్లను కలిశారు.. ఎవరెవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని వైసీపీకి చేరవేశారంటూ ఆరోపించారు. చంద్రబాబు కోసం పూజలు చేసిన కేశినేని నాని.. ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడ వెస్టులో టిక్కెట్లు ఇప్పిస్తానని కేశినేని నాని.. ఇద్దరి దగ్గర నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారు. తామిచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని నానిపై ఒత్తిడి తెస్తున్నారు. కేశినేని నాని కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్నారు.
Read Also: Mrunal Thakur: కొలీవుడ్ లో కూడా దూసుకుపోతున్న మృణాల్.. ముగ్గురు హీరోల సినిమాల్లో ఛాన్స్..
కేశినేని నాని వసూలు రాజా.. నన్ను పిట్టల దొర అంటున్న కేశినేని నాని విషయాన్ని త్వరలో ప్రజలే తేలుస్తారని హెచ్చరించారు కేశినేని చిన్ని.. సీఎం వైఎస్ జగన్ వద్ద.. వైసీపీ ఇన్చార్జుల వద్ద కేశినేని నాని పాలేరు పని చేస్తున్నారని మండిపడ్డారు. కేశినేని నానిది సైకో మనస్తత్వం. విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇవ్వడం కూడా వైఎస్ జగన్‌కు ఇష్టం లేదు అన్నారు. దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి వారికి కేశినేని నాని అసిస్టెంట్ పని చేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు టీడీపీ సీనియర్ నేత కేశినేని చిన్ని. కాగా, గతంలోనూ కేశినేని బ్రదర్స్ మధ్య వివిధ అంశాలపై మాటల యుద్ధం సాగుతోన్న విషయం విదితమే.