
TDP: ఆంధ్రప్రదేశ్లో బుజ్జగింపుల పర్వానికి అన్ని పార్టీలు తెరలేపాల్సిన పరిస్థితి వచ్చింది.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు.. నేతల్లో కొంత అసంతృప్తిగా కారణం కాగా.. సీట్లు ప్రకటించకముందే.. టీడీపీ.. తమ పార్టీ నేతలను బుజ్జగింపులు, లాలింపులు చేస్తోంది.. ఇప్పటికే జనసేనతో కలిసి వెళ్లాలని నిర్ణయానికి రాగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. దీంతో.. కీలక స్థానాల్లోనూ నేతలు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందట.. సుమారు 50-60 సెగ్మెంట్లల్లో నేతలకు టిక్కెట్ల అంశమై సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎదురవుతోందట..ముఖ్యంగా 25-30 స్థానాల్లో సిట్టింగ్ ఇన్ఛార్జీలకు ఈసారి నో టిక్కెట్ అని చెప్పే ఛాన్స్ ఉందనే ప్రచారం సాగుతోంది. జనసేన, బీజేపీలకు 25-30 స్థానాలను కేటాయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే కొందరికి క్లారిటీ ఇచ్చేస్తోన్నారు టీడీపీ ముఖ్యులు.
Read Also: Delhi : ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కుప్పకూలిన పాండల్
ఇక, టిక్కెట్ డైలమాలో ఉన్న కీలక నేతల విషయానికి వస్తే.. గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ, వర్మ, దేవినేని ఉమ, బుచ్చయ్య చౌదరి.. కొనకళ్ల, మండలి బుద్ద ప్రసాద్, ముద్రబోయిన, బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్, జవహర్, చాంద్ బాష ఇలా చాలా మందే ఉన్నారట.. వీరితో పాటు పీతల సుజాత, మాగంటి బాబు, ఆనం, సోమిరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆలపాటి రాజా, కోడెల శివరాం, కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఉన్నారనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. రెండు టిక్కెట్ల కోసం పట్టు బడుతున్న కీలక కుటుంబాలకు కూడా క్లారిటీ ఇస్తోందట టీడీపీ అధిష్టానం.. ఒకే టిక్కెట్ ఇస్తామని స్పష్టం చేస్తున్నారు.. ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నారట సీనియర్ నేత అశోక్ గజపతి రాజు. మరోవైపు.. తమకు పూర్తి క్లారిటీ ఉందని.. తామే పోటీ చేస్తామంటున్నారు గోరంట్ల, బండారు, సోమిరెడ్డి.. తాజా ప్రచారాలతో అలకపాన్పు ఎక్కారట ఆనం..? అయ్యన్నను ఎలా డీల్ చేయాలోనని హైకమాండ్ తర్జన భర్జన పడుతోందట.. కీలక నేతలు దృష్టి సారించడంతో.. కొన్ని స్థానాలపై ఏటూ తేల్చుకోలోకపోతోందట టీడీపీ. ఇక, లోక్ సభ స్థానాల నుంచి పోటీకి కాల్వ, పార్దసారథి నేతలు నిరాకరించడం కూడా టీడీపీ తలనొప్పిగా మారిందనే చర్చ సాగుతోంది.