Kandula Durgesh: ఓటమి భయంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆరోపించారు జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్.. ఇటీవల పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని మండిపడుతూ వస్తున్న జనసేన.. చివరకు పవన్ కల్యాణ్ పర్యటనను కూడా రద్దు చేసినట్టు ప్రకటించింది.. ఇక, ఈ పరిస్థితులపై దుర్గేష్ మాట్లాడుతూ.. పవన్ అంటే వైసీపీకి భయం పట్టుకుంది.. అందుకే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ హెలికాప్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వడం లేదని విమర్శించారు.
Read Also: CM Revanth Reddy: కేసీఆర్, హరీశ్ రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారు..
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన కందుల దుర్గేష్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ అధికారులు అనుమతులు తీసుకోవాలని పవన్ కల్యాణ్ పర్యటనకు అడ్డంకులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాల వల్ల పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా పడిందన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించేలా, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసేలా ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. పనికిరాని సాంకేతిక కారణాల లోపాలు చూపుతూ అనుమతులు నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పర్యటనను రద్దు చేసేందుకు సహకరిస్తున్న అధికారులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు కందులు దుర్గేష్.