Leading News Portal in Telugu

Mahadev Betting App: వైజాగ్ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌లో ఒకరు అరెస్ట్‌



Mahadev Betting App

Mahadev Betting App: వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. వైజాగ్ మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌లో ఒకరు అరెస్ట్‌ అయ్యారు. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ డైరెక్టర్‌ నితీష్‌ దివాన్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌ జైల్లో ఉన్న నితీష్ ధావన్‌ను 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. విశాఖ కోర్టులో నితీష్‌ దివాన్‌ను ప్రవేశపెట్టి ఈడీ విచారించనుంది. దేశవ్యాప్తంగా మహదేవ్‌ బెట్టింగ్ యాప్‌ ద్వారా వేల కోట్లను నితీష్‌ ధావన్‌ వసూలు చేశాడు.. విశాఖలో నమోదైన కేసు ఆధారంగా నితీష్ ధావన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.

Read Also: Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు తప్పిన ప్రమాదం