
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలనాపై రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు ఏర్పాటు చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.వి కృషంరాజు ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లీలా గ్రాండ్ హోటల్ లో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగు అకాడమీ చైర్ పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతితో పాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఈ ప్రభుత్వంలో మహిళలకు ఎన్నో అవకాశాలు వచ్చాయని తెలిపింది. అమ్మ ఒడి దగ్గర నుంచి ఇళ్ల స్థలాల వరకు అదే విధంగా ఇల్లు కట్టించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని పథకాలు మహిళలకు అందించింది అనే విషయాన్ని గుర్తు చేసింది. సుమారు పది లక్షల కోట్లు ఈ ప్రభుత్వం అందించింది మహిళలే మహారాణులు అనే విధంగా జగన్ సర్కార్ మహిళలకు పథకాలు అందించింది అని ఆమె పేర్కొనింది. మహిళల మీద ఉన్న గౌరవం వల్లే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇన్ని పథకాలు తీసుకువచ్చారు.. మహిళలే ఈ సమాజానికి మూలం అని లక్ష్మీపార్వతి తెలిపారు.
Read Also: Chiranjeevi: లాస్ ఏంజిల్స్‌లో ‘మెగాస్టార్’ చిరంజీవికి ఘన సన్మానం!
ఇక, మహత్మా గాంధీ కోరుకున్న జవహర్ లాల్ నెహ్రూ ఆశించింది ఏదైతే ఉందో ఈ మహిళా సాధికారత కోసం ఈ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చక్కగా అమలు అవుతున్నాయని లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళకు హోం మినిస్టర్ పదవి ఇచ్చారు.. అలాగే, ఎంతో మందికి ఇళ్ల స్థలాల రూపంలో ఐదు లక్షల నుంచి 15 లక్షల రూపాయలు అందించారు.. ప్రతి మహిళా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటారు.. మహిళలందరూ ఎలక్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అని ఆమె వెల్లడించారు. రానున్న ఎలక్షన్స్ లో మహిళలకే పెద్ద పీట 51 శాతం ఉన్న మహిళలు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం ఖాయం అని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తెలిపింది.