Leading News Portal in Telugu

TDP and YCP Rebel MLAs: రెబల్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్‌ సీరియస్‌.. అనర్హతపై కీలక నిర్ణయం..!



Rebel Mlas

TDP and YCP Rebel MLAs: తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కాకపోవడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు.. రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్నారు స్పీకర్‌.. రెబల్‌ ఎమ్మెల్యేల కోసం తన ఛాంబర్‌లో చాలా సేపు ఎదురుచూసిన ఆయన.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.. న్యాయనిపుణుల సలహా తర్వాత అర్హత వేటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది..

Read Also: Rahul Gandhi: అయోధ్యలో ఒక్క దళితుడైనా కనిపించారా?.. రాహుల్ విమర్శలు

నలుగురు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌ను ఆశ్రయించింది వైసీపీ.. దీనిపై విచారణకు రావాలంటూ స్పీకర్‌ నోటీసులు పంపినా.. రెబల్‌ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదు.. మరోవైపు.. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌, మద్దాల గిరి, కరణం బలరాం, వాసుపల్లి గణేష్‌పై ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. ఈ రోజు తన చాంబర్‌లో వేచిచూసి.. ఇవాళ టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్ ల పై విచారణను ముగించారు స్పీకర్‌.. అయితే, ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని స్పీకర్ కు లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు .. టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారు.. దీంతో.. రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు.. న్యాయనిపుణుల సలహా తర్వాత రెబల్స్‌పై వేటు తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.