Leading News Portal in Telugu

Gudivada Amarnath Return Gift: లోకేష్‌కి మంత్రి అమర్నాథ్‌ రిటర్న్‌ గిఫ్ట్‌.. మట్టి కుండలో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపిన పప్పు..!



Gudivada Amarnath

Gudivada Amarnath Return Gift: ఏపీలో రాజకీయం కాకరేపుతోంది.. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లే కాదు.. ఇప్పుడు.. గిఫ్ట్‌లు.. రిటర్న్‌ గిఫ్ట్‌ల వరకు వెళ్లింది వ్యవహారం.. అనకాపల్లిలో శంఖారావం సభ నిర్వహించిన నారా లోకేష్‌.. ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్‌నాథ్‌కు కోడిగుడ్డును అవార్డుగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే కాదు.. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన గుడివాడ అమర్నాథ్‌కి దీనిని బహుమతిగా పంపుతున్నానని పేర్కొన్నారు.. దీంతో.. కౌంటర్‌ ఎటాక్‌కు దిగిన మంత్రి గుడివాడ.. లోకేష్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ పంపిస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు.. ఓ కుండలో ఒడికించిన పప్పును తీసుకొచ్చి మరీ చూపించారు..

శంఖారావం అని పలకడం కూడా తెలియని మొద్దు లోకేష్ అని ఎద్దేవా చేశారు మంత్రి అమర్నాథ్.. లోకేష్ కోడిగుడ్డు గిఫ్ట్ కు రిటర్న్ గిఫ్ట్‌ ఇదే.. మట్టి కుండలో పప్పులో.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచాం.. లోకేష్ తనంతట తానుగా వచ్చినా సరే.. లేకపోతే నేనే పంపిస్తాను.. చంద్రబాబు, లోకేష్‌లో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపానంటూ వ్యాఖ్యానించారు.. లోకేష్ లా నేను బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్న ఆయన.. లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్.. అవినీతి చేసినట్టు.. కానీ, భూ ఆక్రమణ లకు పాల్పడినట్టుగానీ నిరూపిస్తే రాజకీయాలు వది లేస్తానని ప్రకటించారు.

ఇక, పవన్‌ కల్యాణే నన్ను ఏమీ పీకలేకపోయాడు నువ్వెంత అంటూ లోకేష్‌పై మండిపడ్డారు అమర్నాథ్.. పూరి గుడిసె నుంచి రాయల్ ప్యాలెస్ లోకి ఎలా ఎదగ గలిగావో చెప్పగలవా లోకేష్…? అంటూ సవాల్‌ విసిరారు.. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే 420.. అటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకుని నన్ను విమర్శిస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పాలు తాగి పెరిగితే.. మాజీ ఎమ్మెల్యే గోవింద్ సారా తాగి పెరిగాడు.. సారా కాసుకుని పెరిగిన నా కొడుకులు అందరూ నన్ను విమర్శి స్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ బంధాలు, బంధుత్వాలు గురించి నీతులు చెబుతున్న లోకేష్.. పవన్ కల్యాణ్‌ సహా కుటుంబ సభ్యులు అందరూ నీ తండ్రి గురించి గతంలో ఏమి మాట్లాడారో ప్రజలకు చెప్పు అని సూచించారు.

మరోవైపు.. ఎర్ర పుస్తకం మొదటి పేజీ తెరిచే అవకాశం కూడా తండ్రి కొడుకులకు రాదని జోస్యం చెప్పారు అమర్నాథ్.. 2019లోనే మీ కుర్చీలు మడత పెట్టే శాం.. నీ ఎర్ర పుస్తకం కూడా మడత పెట్టుకోవాసిందే అన్నారు. సిద్ధం సభలు తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ కి జనానికి వున్న అనుబంధం ఎంత బలంగా ఉందో అర్థం అయ్యిందన్నారు. IT అభివృద్ధిపై TDP, వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులు.. అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదలకు మేం సిద్ధమని ప్రకటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.