Leading News Portal in Telugu

Political Seminar: విజయవాడలో పొటిలికల్ సెమినార్.. హాజరైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జైభారత్ పార్టీలు..



Congress

విజయవాడ నగరంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, జై భారత్ పార్టీల రాష్ట్ర స్ధాయి పొలిటికల్ సెమినార్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సమావేశానికి సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జైభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వి.వి.లక్ష్మీనారాయణ హాజరయ్యారు. సీడబ్యుసీ ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పొలిటకల్ సెమినార్ కొనసాగుతుంది. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై కాంగ్రెస్, వామపక్ష పార్టీలు చర్చిస్తున్నాయి. రాబోయే ఎన్నికల కోసం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేయనున్నాయి. ఇక, ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, వామపక్ష పార్టీలు.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడటమే తమ ప్రధాన లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

Read Also: SundeepKishan: రవితేజ డైరక్టర్ తో సందీప్ కిషన్ కొత్త సినిమా?

ఇండియా బ్లాక్ లోని పార్టీలు ఇక్కడే ఉన్నారు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కమ్యూనిష్టులుగా అన్ని స్థానాలలో పోటీ చేయలేమని మా బలహీనత అంగీకరిస్తున్నామన్నారు. రాజకీయ శక్తిగా కమ్యూనిష్టులు ఎదగాలి.. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తున్నాం.. మీడియాకు అండగా నిలబడేది వామపక్ష ఉద్యమమే అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Atrocious: భార్య బతికి వుండగానే చనిపోయిందని మరో పెళ్లి.. కూతుర్ని కడుపులోనే చంపిన కసాయి

సీడబ్యూసీ ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. ఈనెల 23న వైఎస్ షర్మిల ఆల్ పార్టీ సమావేశం నిర్వహిస్తారు అని పేర్కొన్నారు. ఈనెల 26న అతిఫెద్ద భారీ బహిరంగ సభ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో జరుగుతుంది.. బీజేపీ వ్యతిరేక భావజాలం కలిగిన వారందరూ ఇండియా కుటుంబం అని అన్నారు. అదానీ, అంబానీ ముసుగులో ప్రధాని రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా తయారయ్యాడు అని ఆరోపించారు. సమాజంలో 2 శాతం ఉన్న పెట్టుబడిదారుల కోసం మిగతా వారందరు ఇబ్బందులు పడుతారన్నారు. ప్రత్యేక హోదా, ఎంఎస్పీ మా ప్రధాన అజెండా.. స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ ఆపుతుంది అని గిడుగు రుద్రరాజు వెల్లడించారు.