Leading News Portal in Telugu

Ap Government: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి సర్దుబాటు



Ap

Employees Rationalization: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాల­యాల ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ఇవాళ్టి నుంచి స్టార్ట్ అయింది. గత కొద్ది నెలల క్రితం పెద్దఎత్తున గ్రామ, వా­ర్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. రాష్ట్రంలో కొన్ని సచివాలయాల్లో ఎక్కువ, మరి­కొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. దీంతో అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉద్యో­గు­లు తప్పని సరిగా పని చేసేలా ప్రభు­త్వం రేషనలైజేషన్‌ ఉద్యోగుల సర్దుబా­టుకు రెడీ అయింది.

Read Also: SIP : సిప్ అద్భుతం.. నెలవారీ రూ. 10,000పెట్టుబడితో రూ. 3.50 కోట్లు.. ఎలా అంటే ?

ఇక, 10 రోజుల క్రితమే ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ విధివిధానాలతో కూడిన ఉత్త­ర్వు­లు జారీ చేసింది.. ఇక, జిల్లాలో సర్దుబా­టు ప్రక్రియకు సంబంధించిన తేదీల వారీ­గా షెడ్యూల్‌­ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు ఖరారు చేసింది. ఈ మేరకు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ ధ్యాన్‌చంద్ర జీవో జారీ చేశారు. రేపటి (ఫిబ్రవరి 22) వరకు జిల్లాల వారీగా 8 మంది కన్నా తక్కువ, ఎక్కువ పని చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాల వివరాలతో అధికారులు నివేదికలు రూపొందించనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు 8 మంది కంటే తక్కువ ఉద్యోగులు పని చేస్తున్న సచివాలయాల్లో ఏ కేటగిరి ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయో గుర్తించనున్నారు.

Read Also: Health Tips : పరగడుపున వేడి నీటిలో అల్లం వేసి తాగుతున్నారా?

అయితే, సచివాలయాల్లో ఆ పోస్టుల భర్తీకి ఇప్పటికే సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్‌ ప్రక్రియ కోసం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో తెలిపింది. నిబంధనల ప్రకారం ఎక్కువ మంది ఉద్యోగులు పని చేస్తున్న సచివాలయాల నుంచి సర్దుబాటు కోసం ఒకచోట నుంచి మరోచోటకు జిల్లాల వారీగా ఉద్యోగుల బదలాయించే జాబితాను సిద్ధం చేస్తారు. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది పని చేసే ఛాన్స్ ఉన్నంత వరకు అవసరమైన ఉద్యోగులకు పరిమితే ఆయా జాబితాను జిల్లా అధికారులు రెడీ చేయనున్నారు. కాగా, ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ఎంపిక చేసిన ఉద్యోగులకు సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌ ఇచ్చి.. సర్దుబాటు ప్రక్రియలో పేర్కొన్న ఖాళీల ప్రకారం వారికి నచ్చిన సచివాలయానికి బదలాయించే ప్రక్రియ చేపట్టనున్నారు.

Read Also: Pakistan PM: పాకిస్థాన్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌.. అధ్యక్షుడిగా ఆసిఫ్ జర్దారీ!

అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉ­ద్యోగులు పని చేస్తున్నారు. ఈ సర్దుబాటు ప్రక్రియ­లో సుమారు 5 వేల మంది ఎంప్లాయిస్ కు స్థానచల­నం ఉంటుందని గ్రామ వార్డు సచివా­లయాల శాఖ తెలియజేసింది. ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టే టైంలోనే ఎక్కడైనా భార్యభర్తలు వేర్వేరు సచివాలయాల్లో పని చేస్తుంటే.. వారి అభ్యర్ధన మేరకు ఇరువురు ఒకేచోట పని చేసేందుకు అవకాశం కల్పించారు. కేవలం భార్యభర్తల కోటాకే పరిమితమై కొనసాగే ఈ బదిలీలు జిల్లా పరిధిలో అంతర్గతంగా కొనసాగుతుంది.. అదే సమయంలో ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు ఛాన్స్ కల్పించేందుకు అధికారులు తెలిపారు.