
Congress: ఛండీఘర్ మేయర్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఏపీ మాజీ పీసీసీ చీఫ్, సీడబ్యూసీ ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు అన్నారు. బీజేపీ జాతీయ సమావేశంలో రామ నామస్మరణ, మోడీ నామస్మరణ మాత్రమే చేసింది అని విమర్శలు గుప్పించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా బీజేపీ కూడా విస్తరించుకుంటూ పోవాలని మాత్రమే చూస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో కేజ్రీవాల్ ను కూడా జైలులో పెడతారు అంటూ ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. స్థానిక పార్టీలను సైతం బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ తో అలయెన్స్ లో ఉన్న వారిని కమలం పార్టీ ఇబ్బందులు పెడుతుందని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
Read Also: Delhi : ఢిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు మృతి
ఓటర్లు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ని తెలుసుకోవాలి గిడుగు రుద్రరాజు అన్నారు. రీజనల్ పార్టీల ముసుగులో బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రావాలని ప్రయత్నిస్తోంది అని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఒక చెత్తో చంద్రబాబు, మరో చెత్తో సీఎం జగన్ లను పట్టుకుని ఉంది అని అన్నారు. ఈనెల 23న సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వైఎస్ షర్మిలను కలుస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ప్రసంగిస్తారు అని ఏపీ మాజీ పీసీసీ చీప్ గిడుగు రుద్రరాజు వెల్లడించారు.